Vandana Katariya: హాకీకి వీడ్కోల పలికిన వందన కటారియా 5 d ago

భారత మహిళా హాకీ దిగ్గజం వందన కటారియా తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. 32 ఏళ్ల వందన, 320 మ్యాచ్‌లలో 158 గోల్స్ సాధించారు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం చేజార్చుకున్న భారత జట్టులో వందన కూడా సభ్యురాలు. 'బాధతో భారమైన హృదయంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నా. ఎంతో కష్టపడి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగా. భారత జెర్సీ ధరించడం ఎంతో గర్వకారణం. సుదీర్ఘ కాలం దేశంకోసం ఆడాను. ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ, హాకీ ఇండియా లీగ్‌లో కొనసాగుతా.' అని వందన తెలిపారు.